calender_icon.png 23 August, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి 930 రోడ్డు విస్తరణ లోపాలపై చర్యలు తీసుకోవాలి

22-08-2025 07:08:19 PM

ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతిపత్రం

వలిగొండ,(విజయక్రాంతి): జాతీయ రహదారి 930 రోడ్డు విస్తరణ లోపాలపై చర్యలు తీసుకోవాలని ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి  సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ రహదారి 930T కి వలిగొండ నుండి తొర్రూరు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులలో నాణ్యత లేకుండా రోడ్డు పనులు జరుగుతున్నాయి.

డ్రైనేజీ, రోడ్డుకు ఇరువైపులు ఉన్న బావులకు సైడ్ వాళ్ళు లేనందున ప్రమాదాలకు  అంచున ఉన్నాయని అలాగే గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా జాలీలు నిర్మించడం వల్ల గ్రామంలోని ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే హై బ్రిడ్జిలు ఏర్పాటు చేయించేలా, నాణ్యత లోపాల పైన ప్రభుత్వం వి.డి.బి కన్స్ట్రక్షన్ పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులను కోరారు.