calender_icon.png 23 August, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎస్సై కుటుంబానికి భద్రత చెక్కు అందజేత

22-08-2025 07:10:57 PM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఎస్సై వెంకట్ రెడ్డి భార్య శ్రీలతకు రూ.8 లక్షల భద్రత ఎక్స్ గ్రేషియా చెక్కును శుక్రవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఏఎస్సై వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులకు శాఖపరంగా ఎటువంటి సహాయం అందించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి,ఏఓ శ్రీనివాస్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం తదితరులు పాల్గొన్నారు.