22-08-2025 07:05:01 PM
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జహంగీర్
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ పట్టణ కేంద్రంలోని సాయి నగర్ కాలనీ మీదుగా వెళుతున్న భీమలింగం కాల్వపై నూతన బ్రిడ్జిలను, ఇరువైపులా గోడలను వెంటనే నిర్మాణం చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జహంగీర్ అన్నారు. శుక్రవారం రోజున సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన పోరుబాటలో భాగంగా స్థానిక సాయి నగర్ కాలనీ మీదుగా వెళుతున్న భీమ లింగం కాల్వ కల్వర్టులను సిపిఎం పట్టణ మండల కమిటీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు ఎలాంటి ప్రమాదం జరగకముందే ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలని అదేవిధంగా సాయి నగర్ కాలనీ నుండి మార్కెట్ యార్డు చివరి వరకు కాల్వకి ఇరువైపులా గోడలను నియమించాలని కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఆకును వెంటనే తొలగించాలని భీమలింగం కాల్వ కల్వర్టులను స్థానిక ఎమ్మెల్యే వెంటనే సందర్శించాలని అన్నారు. గతంలో భీమ లింగం కాల్వ కల్వర్టులపై నూతన బ్రిడ్జిలను, సైడ్ గోడలను నిర్మించడానికి 5కోట్ల నిధులు కేటాయించి కేవలం ఒకవైపు మాత్రమే గోడను కొద్దిమేరకు నిర్మించి వదిలేసారని అన్నారు.