calender_icon.png 17 September, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజా దగ్ధమవుతున్నది!

17-09-2025 01:07:56 AM

ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులు

బాంబ్ దాడు కారణంగా భవన సముదాయాలు నేలమట్టం

78 మంది మృతి.. నిరాశ్రయులుగా వేలాది మంది

దోహా, సెప్టెంబర్ 16: హమాస్ బూచిని చూపి గాజాను నామ రూపల్లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మారణహో మానికి పాల్పడుతున్నది. ఇప్పటివరకు వైమానిక దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూతల దాడులకు దిగింది. అంతర్జాతీయ సమాజం, హమాస్ బందీల కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలోకి చొచ్చుకెళ్లింది.

బాంబ్ దాడుల గాజాలోని పెద్ద భవన సముదాయాలు నేలమట్టమయ్యాయి. తాజాగా దా డుల కారణంగా 78 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నబ్లస్‌కు దక్షిణంగా ఉన్న ఖుస్రా, సుర్రా, తుల్కరేమ్ ప్రాంతాల్లోని ఇళ్లపై దాడులు జరిగాయి. దాడులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ ‘గాజా తగులబడుతున్నది. నగరంలోని హమాస్ మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే మా లక్ష్యం’ అని ప్రకటించారు.

ఇజ్రాయెల్ మారణహోమాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. దాడులు, తదనంతర పరిణామాలకు అమెరికా పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నది. అమెరికా రాజకీయ, సైనిక మద్దతుతోనే ఇజ్రాయెల్ డాడు లకు పాల్పడుతున్నదని ఆరోపించింది. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అరబ్, ఇస్లామిక్ చొరవ తీసుకోవాలని కోరింది. పశ్చిమాసియా దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఖతార్ మధ్యవర్తిత్వం వహి స్తోంది. 

కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందాలపై చర్చలు జరపడంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇజ్రాయెల్ నుంచి ఖతార్‌కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కానీ, ఇజ్రా యెల్ గాజా నగరంపై భూతల దాడిని ప్రారంభించడంతో ఖతార్ మధ్యవర్తిత్వంలోని శాంతి ప్రయత్నాలు దెబ్బతిన్నాయి. దాడి కారణంగా శాంతి చర్చలు నిలిచిపోయాయి.

మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు మారణహోమమని ఐక్యరాజ్యసమితికి చెందిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక సంచలన నివేదిక విడుదల చేసింది. పాలస్తీనియన్ల జాతి నిర్మూలనకు ఇజ్రాయెల్ పూ నుకున్నదని అభిప్రాయపడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి  ఇప్పటివరకు గాజాకు చెందిన 10 శాతం కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. 2023  అక్టోబర్ నుంచి ఇప్పటివరకు సు మారు 65,000 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.