17-09-2025 01:09:33 AM
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, సెప్టెంబర్ 16 : జిల్లాలో యూరి యా కొరత లేదని, వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. మంగళ వారం భీమారం రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి సుధాకర్ తో కలిసి రైతులతో మాట్లాడారు. గత ఏడాది మండలంలో 14 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తే ఈ ఏడాది ఇప్పటికే 11 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు.
ఇంకా మండలంలో అవసరం మేరకు మూ డు, నాలుగు రోజుల్లో పీఏసీఎస్, డీసీఎంఎస్ సొసైటీలలో యూరియా అందుబాటులో ఉంచుతామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను పరిశీలించి కేజీబీవీని సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు. ఆరవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు.
విద్యా రంగ బలోపేతానికి చర్యలు
జైపూర్: విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కేబీబీవీ సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, సామాగ్రి భద్రపరచు గది, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం దృ ష్ట్యా మధ్యాహ్నం భోజనంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలలో పారిశుద్ధ నిర్వహణ పక డ్బందీగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు.