calender_icon.png 19 May, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసవేశ్వరుని బోధనలు అనుసరించాలి

19-05-2025 12:00:00 AM

జహీరాబాద్, మే 18 :  జగద్గురువు బసవేశ్వరుని బోధనలను అనుసరించి ముక్తి మార్గంలో నడవాలని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహా మండలేశ్వర్ వైరాగ్య శిఖామణి సిద్దేశ్వరానందగిరి మహారాజ అన్నారు. ఆదివారం నాడు జరా సంఘం మండలం మేదపల్లి గ్రామంలో జగద్గురువు శ్రీ బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ధనసిరి ఆశ్రమ పీఠాధిపతి శివాచార్య మహారాజ్, మల్లన్న గట్టు బస్వా నంద మహారాజ్ రంజుల ఆశ్రమం పీఠాధిపతి రాజయ్య స్వామి ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, జరా సంఘం మండలం బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశం కీతకి ఆలయ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు పీఠాధిపతులు మాట్లాడుతూ 14వ శతాబ్దంలో మహాత్మా బసవేశ్వరుడు కులాలకు అతీతంగా మానవులంతా ఒకటేనని అందరిలో ప్రవహించేది రక్తమేనని అందుకు మానవులందరూ సమానంగా జీవనం గడపాలని వారు సూచించారు.

మహాత్మా బసవేశ్వరుడు ఆ కాలంలోనే అనేక సంస్కరణలు తెచ్చి మానవుల జీవన విధానానికి నాంది పలికారని తెలిపారు మహాత్మా బసవేశ్వరుడు బోధనలు అనుసరించి జీవన్ముక్తిని పొందాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మాజీ జెడ్పిటిసి వినీల నరేష్ మల్లన్న పటేల్ సంగమేశ్వర్ గ్రామ బసవదల నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.