12-09-2025 12:00:00 AM
హుజురాబాద్,సెప్టెంబర్ 11:(విజయ క్రాంతి) అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని శంకరపట్నం ఎస్‌ఐ శేఖర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు సమీపంలో, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న జెసిబి, ట్రాక్టర్, అక్రమంగా ఇసుక తరలిస్తున్న మరో ట్రాక్టర్ ని గురువారం పట్టుకునే సీజ్ చేశారు.
సందర్భంగా ఎస్‌ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇసుక తరలించేటప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించారు. మట్టి తరలించేవారు మైనింగ్ నుండి, తాసిల్దార్ నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.