15-11-2025 07:51:57 PM
ఒకరి పరిస్థితి విషమంగా ఉంది..
ఒకరికి తీవ్ర గాయాలు..
కొండపాక: రాజీవ్ రహదారిపై చెట్లకు నీరు పోస్తున్న నీటి ట్యాంకర్ వాహనాన్ని కోళ్ల ఫీడ్ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన కొండపాక శివారులో గౌరాయపల్లి స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ వాహనాన్ని హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టి రోడ్డుకు కిందకు దూసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టింది. దాంతో లారీ డ్రైవర్ ప్రవీణ్ అందులోనే ఇరుక్కుపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, రమేష్ చేరుకొని లారి నుంచి డ్రైవర్ ను బయటకు తీసి ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.