23-12-2025 02:33:44 AM
మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, వివేక్ వెంకట స్వామి
మహబూబ్‌నగర్‌లో కాకా క్రికెట్ పోటీలు ప్రారంభం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రులు వాకిటి శ్రీహరి, మహ మ్మద్ అజహరుద్దీన్, వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం పిల్లల మర్రి రోడ్డులో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌లో జి వెంకట స్వామి (కాకా)స్మారక ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టి.20 లీగ్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని క్రీడలను ప్రారంభించారు.
మహబూబ్ నగర్ మండలం అప్పనపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ.. గొర్రెల కాపరుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిసారి, సంవత్సరానికి రెండు సార్లు చేపట్టే నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా, ఈ ఎడా ది కూడా ప్రభుత్వం రూ. 4.5 కోట్లతో నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి అన్నారు.
గొర్రెలు, మేకలు వ్యాధుల కారణం గా మృతిచెందినప్పుడు కాపరులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త బీ మా పథకాలను తీసుకువస్తోందని మంత్రి తెలిపారు. గొర్రెల కాపరుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం కాపరి మరణ బీమా పథకాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు.
ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.