calender_icon.png 22 January, 2026 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు

22-01-2026 12:51:34 AM

అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ఆలేరు, జనవరి 21:  18 సంవత్సరాలు నిండని బాలురు, బాలికలను ఎవరైనా పనిలో పెట్టుకొని, బాల కార్మికులు గా మారిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  స్థానిక సంస్థ ల  అదనపు కలెక్టర్, రెవిన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం భువనగిరి కలెక్టర్ ఆఫీస్, మినీ మీటింగ్ హల్ లో బాల కార్మికుల వ్వవస్థ నిర్ములన ఆపరేషన్ స్త్మ్రల్ పై సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ 0 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ పని చేసిన, వెట్టి చాకిరీ చేయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 97 మంది పిల్లలను రెస్క్యూ చేయటం జరిగిందన్నారు. ఆపరేషన్ ముస్కాన్ లో అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, వృత్తిపరమైన, బాధ్యతగా శ్రద్ధతో, పనిచేసి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. 

 పిల్లల సంరక్షణ కొరకు 1098కు సమాచారం ఇవ్వాలని, ఈ హెల్ప్ లైన్ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు.   జిల్లాలో ఆపరేషన్ స్త్మ్రల్ కి సంబంధించిన 3 టీం లు 18 సంవత్సరాల లోపు బాల కార్మిక పిల్లలను పని లో పెట్టుకున్నట్లయితే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఎ1గా ఓనర్ ఎ2 మేస్త్రి ఎ3 సంబంధిత పరిశ్రమల సూపర్ వైజర్స్ లపై కేసులు నమోదు చేయాలన్నారు. పరిశ్రమల యజమానులకు  కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల దగ్గర అంగన్వాడీ సెంటర్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి డబ్ల్యూ సి, జె జె బి. స్టాఫ్ కమిటీ, బీ ఆర్ బీ కో ఆర్డినేటర్ అనంతలక్ష్మీ. జిల్లా డీఎంఏచ్‌ఓ అధికారి మనోహర్, ప్రశాంత్ రెడ్డి. పోలీస్ శాఖ సిబ్బంది. ఎన్జీవో ప్రతినిధులు. చైల్ హెల్ప్ లైన్ సీసీ ఐ సిబ్బంది, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.