23-09-2025 12:31:09 AM
విజయక్రాంతి వరుస కథనాలకు స్పందించిన మత్స్యశాఖ అధికారులు
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 22 విజయక్రాంతి: నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులో మత్స్యకార సొసైటీ సభ్యులు అక్రమంగా ఆంధ్ర ప్రాంత జాలర్లకు అర్రస్ పాట ద్వారా చేపలను ఇతర ప్రాంతాలకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తించి పలుమార్లు విజయక్రాంతి వరుస కథనాలను ప్రచురించింది.
దీంతో ఎట్టకేలకు సోమవారం మత్స్యశాఖ జిల్లా అధికారులు కేసరి సముద్రం చెరువు కట్టపై అనుమతి లేకుండా చేపలు పట్టకూడదని బ్యానర్లను ప్రదర్శించారు. ఆదేశాలను ధిక్కరించి చేపలు పట్టే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని మత్స్య శాఖ అధికారిణి రజినిపేర్కొన్నారు.