calender_icon.png 23 September, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించిన మండల వ్యవసాయ శాఖ అధికారి సుదర్శన్‌గౌడ్

23-09-2025 12:32:43 AM

మాగనూరు సెప్టెంబర్ 22 విజయ క్రాంతి. మండల కేంద్రంలో ప్రభుత్వ సంస్థ హైదరాబాదు అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఫర్టిలైజర్ షాపు ను సోమవారం మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఈ యొక్క సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న ఫర్టిలైజర్ నాణ్యమైనదని రైతులు ఈ యొక్క షాపులో లభించే ఫర్టిలైజర్ ను తమ పంట పొలాలకు వాడు కోవచ్చు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యజమాని నరసింహారెడ్డి,కాంగ్రెస్ మండ ల అధ్యక్షుడు ఆనంద్ గౌడు, మాజీ సర్పంచ్ రవీందర్,, పుంజునూరు ఆంజనేయులు, మల్లారెడ్డి, కృష్ణయ్య, మాజీ వైస్ ఎంపీపీ తిప్పయ్య, వేణుగోపాల్, వివిధ పార్టీల నాయకులు రైతులు తదితరులుపాల్గొన్నారు.