calender_icon.png 23 September, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలపై వేధింపులు అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి

23-09-2025 12:29:36 AM

- రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి 

ఘట్ కేసర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : బాలికలపై జరుగుతున్న వేధింపు లు అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి పిలుపుని చ్చారు.నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాల సం దర్బంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద ఆదేశాల మేరకు మహిళా కమీషన్ ఆధ్వర్యంలో సోమవారం పోచారం ము న్సిపల్ అన్నోజిగూడ శ్రీ లక్ష్మీనరసింహ కాల నీ లోని మినీ ఫంక్షన్ హాల్ లో ‘కూతుళ్ల భద్రతకూతుళ్ల విద్య‘ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో బాలికల రక్షణ, బాలికలకు నాణ్యమైన విద్య అందించడంపై అవగాహన కల్పించారు. బాలికలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజ రమణ మాట్లాడుతూ కూతుళ్లను భ ద్రంగా, సమాన హక్కులతో చదివించడం ప్రతి కుటుంబం కర్తవ్యమని,విద్య ద్వారానే బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని, చట్టపరమైన రక్షణలు, 181, 100 హెల్ప్లైన్ సదుపాయాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో షీటీమ్ అధికారులు, మ హిళలు, బాలికలకు సైబర్ సేఫ్టీ మరియు సా మాజిక మాధ్యమాల వినియోగం మీద అవగాహన కలిగించారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ మహిళలు, బాలికలకు ఎటువంటి పోషకాహరం తీసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం పైన అవగాహన కలిగించా రు. నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు మహిళాశక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈసందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. ఈకార్యక్రమంలో షీటీమ్, మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచ ర్స్, ఆడాల్సెంట్ గరల్స్, మహిళలు, అల్వాల్ సిడిపిఓ స్వాతి, ఐసీడీఎస్ సూపర్వైజర్స్, మహిళా కమీషన్ అధికారులు పాల్గొనడం జరిగింది.