06-05-2025 01:20:58 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, మే 5 (విజయక్రాంతి): అనరులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లలో అనరులు రాకుండా మండల ప్రత్యేక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
జాబితాలో ఒక్క శాతం అనరులు ఉండరాదని, ఒకవేళ ఉన్నట్లయితే ఎమ్‌ఎస్‌ఓ (మండల స్పెషల్ ఆఫీసర్) దే పూర్తి బాధ్యత అని అన్నారు. ఎలాంటి అధికారిక, రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని, రాష్ర్టప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు ఇవ్వడం ఒక గొప్ప విషయమని తెలిపారు.
ఇది వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం పొందిన వారికి తిరిగి రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అరత ఉండదని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాస పథకం లక్ష్యాన్ని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ వారాంతానికి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సంబంధించిన దర్తి ఆబా యోజన పథకం ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పంపించాలని ఆదేశించారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఇంఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంఛార్జి అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డీఆర్డిఏ శేఖర్ రెడ్డి, నల్గొండ ఇంఛార్జి డిఆర్‌ఓ, ఆర్డిఓ వై.అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.