calender_icon.png 6 May, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర కులగణనతోనే బీసీలకు న్యాయం

06-05-2025 01:21:39 AM

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): బీసీ జనాభా రాష్ర్టంలో 50 శాతానికి పైగా ఉన్నా.. కాంగ్రెస్ ఇటీవల చేసిన కుల సర్వేలో బీసీల సంఖ్యను తక్కువగా చూపించి అన్యాయం చేసిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్రం చేపట్టబోయే కులగణనతోనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.10 నుంచి రూ. 20 లక్షల మధ్య పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ వాటిని చెల్లించలేదన్నారు. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్లు మంత్రులకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం బాధాకరమన్నారు.

అసమర్థ పాలనకు రేవంత్ ప్రభుత్వం చిరునామాగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో అకాల వర్షాల కారణంగా ఆగమైన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు తగ్గడం వెనుక మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులు, ఫ్లుఓవర్లకు వేల కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. కరీంనగర్ వైపు రాహదారిని జాతీయ హైవేగా మారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, దీనిపై కేంద్రానికి నివేదిస్తామని ఈటల తెలిపారు.