06-05-2025 01:20:05 AM
ముఖ్యఅతిథిగా కేటీఆర్
హైదరాబాద్, మే 5 (విజయక్రాం తి): ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు కొనసాగింపుగా సంవత్సరం పాటు విదేశాల్లో రజతోత్సవ సభలు నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలోని డల్లాస్‌లో డాక్టర్ పెప్పర్ అరేనాలో జూన్ 1న రజతోత్సవ సభను నిర్వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
రాబోయే రోజుల్లో అమెరికా సహా వివిధ దేశాల్లో వేడుకలు నిర్వహిస్తామన్నారు. మాట్లాడుతూ అమెరికాలో వివిధ సంఘాలను, తెలంగాణ ఎన్నారై ప్రముఖులను సమన్వ యం చేసుకొని నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఆటపాటలు, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని బీఆర్‌ఎస్ యుఎస్‌ఏ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ వెల్లడించారు.