calender_icon.png 8 January, 2026 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న సాధనశూరుల ప్రదర్శన

07-01-2026 12:00:00 AM

వెంకటాపూర్, జనవరి 6 (విజయక్రాంతి): ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపి.. కండ్లముందే కనికట్టు చేస్తారు. మంత్రమో.. తంత్రమో తెలియని విద్యతో విస్మయానికి గురిచేస్తారు. ఊరూరా తిరుగుతూ.. నడి వీధుల్లోనే నాటక ప్రదర్శనలిస్తారు. సామాన్యుల ఊహలకందని సాహసాలు ప్రదర్శిస్తూ.. ‘ఔరా’ అనిపిస్తారు. వారే.. సాధన శూరులు.. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం ఉదయం నిర్వహించిన సాధన శూరుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

గ్రామంలోని పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విన్యాసాలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సాధన శూరులు పలు రకాల విన్యాసాలు, సాధన ప్రదర్శనలు గ్రామస్తులకు ప్రదర్శించారు. ప్రతి ఏటా గ్రామాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సాధన శూరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, పెద్దలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.