calender_icon.png 27 July, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెర్లగోపులారంలో రైన్ డే సెలబ్రేషన్స్..

26-07-2025 08:15:41 PM

పిల్లల్లో వాతావరణ అవగాహన పెంచే వినూత్న కార్యక్రమం..

కొండాపూర్: కొండాపూర్ మండల పరిధిలోని చెర్లగోపులారం ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో రైన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ పిల్లలతో కలిసి పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్ అనసూయ వేసవి తడిపే వర్షంలో గొడుగులు పట్టించి వాతావరణ మార్పులపై అవగాహన కల్పించారు. వర్షకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాతావరణం మార్పులను గుర్తించే విధానాలపై పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా సూచనలు ఇచ్చారు. చిన్నారులు రంగురంగుల గొడుగులతో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ సెలబ్రేషన్ ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందించేందుకు, రక్షణ చర్యల పట్ల స్పష్టత కలిగించేందుకు ఉపాధ్యాయులు తీసుకున్న ఈ ప్రయత్నం అభినందనీయం.