calender_icon.png 24 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంచినోల్లే నరికేశారు!

11-02-2025 12:00:00 AM

  1. ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణంలో నరికేసిన చెట్లు
  2. దుంగలు మాయం
  3. అధికారులు తీరుపై మండి పడుతున్న ప్రజలు
  4. మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసమే అంటున్న అధికారులు
  5. బాధ్యులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు 

కోనరావుపేట, ఫిబ్రవరి 10: మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది, ఇంటికి ఐదు మొక్కలు పెంచా లని ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగహన కల్పిస్తున్న అధికారులే, మొక్కల పాలిట శాపంగా మారారు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను మేకలు మేస్తే మేకలకాపారికి, ఇంటి ఎదుట పెరిగిన చెట్టు కొమ్మలను నరి కి వేస్తే జరిమానా విధించి అధికారులే ఏకం గా ఏపుగా పెరిగిన పదులు సంఖ్యలో చెట్ల ను నరికివేసి, ఆ చెట్ల దుంగలను మాయం చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరా వుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుం ది.

మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయం వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలం లో హరితహారం పథకం ద్వారా మొక్కలను నాటే ప్రక్రియ చేపట్టారు. ఆ మొక్కలు కాస్త చెట్లుగా పెరిగాయి. ఆయా పనుల కోసం మండల కార్యాలయాలకు వచ్చిన ప్రజలకు ఆ చెట్లు సేద తీర్చుకునేందుకు నీడ నిచ్చేవి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మండలానికోక మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసేందు కు ఈ స్థలాన్ని అధికారులు కేటాయించారు.

అయితే ఈ స్థలం కాకుండా ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చాలినం త ఖాళీ స్థలం ఉన్నప్పటికి, ఈ స్థలాన్ని కేటాయించడం పట్ల అంతర్యమేమిటో తెలి యడం లేదు. మొక్కలను పరిరక్షించాల్సిన అధికారులూ నరికివేస్తే గ్రామాలల్లో ఉండే చెట్లకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నలు తలె త్తుతున్నాయి.

ఇప్పటికే గ్రామాల్లో వ్యాపారు లు చింత చెట్లు, వేప, మర్రి వంటి భారీ వృక్షాలను సైతం ట్రాక్టర్, లారీలలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులే ఇలా చెట్లను నరికివేస్తే కలప స్మగర్ల ఆగడా లను అరికట్టావారు ఎవరుంటారు. అయితే ఎంపీడీవో కార్యాలయంలో వెనుకాల ఉన్న పదుల సంఖ్యలో ఉన్న చెట్లను ఇందిర్మి మో డల్ ఇల్లు నిర్మాణం కోసం కాంట్రాక్టర్కు చెట్ల నరికివేయడం బాధ్యతలను అప్పగించ డంపై పలు అనుమానాలకు తావిస్తుంది.

ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లు నరివేయడం నేరం కాగా అందులో కాంట్రా క్టర్ చెట్ల దుంగలను అప్పగించడం ఎంటాని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంచె చేను మేసినట్లుగా మండలాధికారుల పనితీ రుపై సర్వత్ర నిరసన వ్యక్తం కాగా దీనిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యుల పై చర్యలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేసున్నారు.

కాగా అందు లో కాంట్రాక్టర్ చెట్ల దుంగలను అప్ప గించడం ఎంటాని స్థానికులు అగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కంచె చేను మేసినట్లుగా మండ లాధికారుల పనితీరుపై సర్వత్ర నిరసన వ్య క్తం కాగా దీనిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా బాధ్యులపై చర్యలపై చర్యలు తీసుకో వాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇందిరమ్మ మోడల్ ఇల్లు కోసమే నరికివేశాం

మండల కేంద్రానికి కేటాయించిన ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణం కో సం కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్ధలాన్ని హౌజింగ్ డిపార్టమెంట్ అధికారులు పరిశీలించారు. స్థల పరిశీల న చేసిన తర్వాత మోడల్ భవన నిర్మాణ కోసం చెట్లను నరికివేయడానికి కాంట్రా క్టర్కు అప్పగించారు. దీంతో సదరు కాం ట్రాక్టర్ భారీగా పెరిగిన చెట్లను యంత్ర సాయంతో నరికివేశారు. చెట్ల దుంగ లను కాంట్రాక్టర్ తీసుకువెళ్లారు. త్వరలో నే మోడల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తాం.

  గూడ శంకర్ రెడ్డి, ఇన్చార్జీ ఎంపీడీవో, కోనరావుపేట