calender_icon.png 15 September, 2025 | 5:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభం భారీ వృద్ధి

30-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ నికరలాభం ఈ క్యూ2లో 8 రెట్లు పెరిగి రూ. 1,741 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2లో కంపెనీ రూ. 228 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇబిటా 46 శాతం వృద్ధితో రూ. 4,354 కోట్లకు చేరినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. 

అదానీ పోర్ట్స్ లాభం 37 శాతం అప్

అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో 37 శాతం పెరిగి రూ. 2,413 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 1,762 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 6,952 కోట్ల నుంచి రూ. 7,372 కోట్లకు పెరిగింది. ఇబిటా 13 శాతం వృద్ధిచెంది రూ. 4,369 కోట్లకు పెరిగినట్లు కంపెనీ ప్రకటన తెలిపింది.