30-10-2024 12:00:00 AM
రెన్యువబుల్ ఎనర్జీ సబ్సిడరీ ఐపీవోకు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీకి రెన్యువబుల్ ఎనర్జీ సబ్సిడరీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదించిన రూ. 10,000 కోట్ల ఇనీషియ ల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ప్రతిపా దిత ఐపీవోలో రూ. 10 ముఖవిలువగల తాజా ఈక్విటీ షేర్లనే జారీచేయ నుంది.
ఇష్యూలో అర్హులైన కంపెనీ ఉద్యోగులకు డిస్కౌంట్‌తో షేర్లను రిజర్వ్ చేశా రు. తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 7,500 కోట్లను ఎన్టీపీసీ గ్రీన్‌కు చెందిన నూరు శాతం సబ్సిడరీ ఎన్టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ (ఎన్‌ఆర్‌ఈఎల్)లో పెట్టుబడి చేయడంతో పాటు ఆ సంస్థకు ఉన్న కొన్ని రుణాలను తీర్చడానికి, ఇతర కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్‌కు ప్రస్తుతం 3.5 గిగావాట్ల స్థాపక సామర్థ్యం ఉండగా, 28 గిగావాట్ల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నది.