02-12-2025 01:07:46 AM
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు డిమాండ్
సుల్తానాబాద్, డిసెంబర్ 01 (విజయ క్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను తెచ్చిందని వీటిని వెంటనే రద్దుచేసి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు, సోమవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభల గోడ పోస్టర్లను కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈనెల 7, 8, 9 మూడు రోజులపాటు మెదక్ పట్టణంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5 వ మహాసభలు జరుగుతున్నాయని డిసెంబర్ 7న కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని అన్నారు.... ముఖ్య అతిథులుగా సిఐటియు అఖిలభారత అధ్యక్షురాలు హేమలత జాతీయ నాయకులు బి,వి, రాఘవులు , ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు, ఈ కార్యక్రమంలో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు....