calender_icon.png 18 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగేజీపై అదనపు చార్జీ

18-12-2025 01:09:06 AM

  1. పరిమితికి మించితే వర్తింపు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రైళ్లలో ప్రయాణికులు పరిమితికి మించి లగేజీ తీసుకెళితే అదనపు ఛారీలు చెల్లించాల్సి ఉంటుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో మంత్రి ప్రకటన చేశారు. విమానాల మాదిగా పరిమితికి మించి లగేజీ తీసుకెళితే రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేసే నిబంధనలు ఏమైనా ఉన్నాయా అని తెలుగుదేశం ఎంపీవేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

పెరిగిన లగేజీ ఛార్జీలు

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో ప్రయాణికులు అధిక లగేజీ తీసుకు వెళితే అదనపు ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఈ పరిమితి దాటినే అదనంగా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఏసీ టూటైర్లో 50 కిలోల వరకు.. ఏసీ త్రీటైర్‌లో 40 కేజీల వరకు లగేజీ తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

ఇక జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి కేవలం 35 కిలోల లగేజీ తీసుకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అలాగే ప్రస్తుతం నాలుగు గంటల ముందు ప్రిపేర్ చేస్తున్న రిజర్వేషన్ చార్ట్‌ను 10 గంటల ముందు రూపొందించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

కొత్త టైమింగ్స్ ప్రకారం ఉదయం 5 నుంచి 2 గంటల వరకు బయలుదేరే రైళ్లకు మొదటి చార్ట్‌ను ముందురోజు రాత్రి 8 గంటలకల్లా రూపొందించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2.01 రాత్రి 11.59 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బయలుదేరే రైళ్ల తొలి చార్టును కనీసం 10 గంటల ముందు తయారు చేయాల్సి ఉంటుంది.