18-12-2025 01:11:03 AM
భారత్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు, బెదిరింపులు
తమ దౌత్య సిబ్బందికి భద్రత కల్పించాలని భారత్ డిమాండ్
ఢాకా, డిసెంబర్ 17 : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత వీసా దరఖా స్తుల కేంద్రాన్ని భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. కొందరు బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసాంఘిక శక్తుల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమ వుతోంది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పా ర్క్‌లో ఉన్న వీసా కేంద్రాన్ని బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే బుధవారం కోసం షెడ్యూల్ అయిన దరఖాస్తులను మరో తేదీకి మార్చనున్నట్లు వెల్లడించింది.
భారత హైకమిషన్ వైపు మార్చ్
భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ హైకమిషనర్ ముహమ్మద్ రియాజ్ హమీదు ల్లాకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యం లో ఢాకాలోని భారత హైకమిషన్ వద్ద ఉద్రిక్తతలు సృష్టించేందుకు కొన్ని తీవ్రవా ద శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ దౌత్య సిబ్బంది, కార్యాలయాలకు భద్రత కల్పించడం బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది. మరోవైపు, ఢాకాలో నిరసనకారులు భారత హైకమిషన్ వైపు భారీ మార్చ్ నిర్వహించారు.
భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు దేశం విడిచి వెళ్లిన వారిని అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌లో కొన్ని శక్తులు భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నా మని విదేశాంగ శాఖ పేర్కొంది. బంగ్లాదేశ్ ప్రజలతో భారత్‌కు చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయని, వాటిని మరింత బలోపేతం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.