09-10-2025 12:00:00 AM
నంగునూరు, అక్టోబర్ 8:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సనాదుల వివేక్ (13) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన ఒక్క రోజులోనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో వివేక్ స్వగ్రామమైన నంగునూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటన నేపథ్యంలో నంగునూరు యువత బుధవారం నంగునూర్,గట్లమల్యాల జిల్లా పాఠశాల,మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలతో పాటు అక్కేనపల్లి మోడల్ స్కూల్లను బంద్ పాటించి తమ నిరసనను తెలియజేశారు.మృతికి కారణమైన అంశాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పాఠశాల ప్రధానౌపాధ్యాయులు,ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని నిరసన వ్యక్తం చేశారు.సమగ్ర విచారణ జరిపి,మరణానికి గల అసలు కారణాలు తెలపాలని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.