18-08-2025 11:19:08 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ప్రారంభించారు. రక్తదానం చేయడం ఎంతో ప్రాముఖ్యత కూడిందని ఆయన తెలిపారు. సభ్యులు పాలుపంచుకుని రక్తం అవసరం ఉన్న రోగులకు సహకరించాలని కోరారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను రక్తదానం చేయడానికి ప్రోత్సహించాలని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రావని ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ గా నేరెళ్ల హనుమంతు వ్యవహరించారు. మరియు నిర్మల్ లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేకల శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిబిరాలను మరిన్ని నిర్వహించి ప్రభుత్వానికి సహకరిస్తామని విన్నవించడం జరిగినది.