calender_icon.png 19 August, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సమానత్వానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్

19-08-2025 12:00:00 AM

-రాష్ర్ట మంత్రి దామోదర రాజనర్సింహ్మ

-కలెక్టరేట్ ముందు నూతన విగ్రహావిష్కరణ

సంగారెడ్డి, ఆగస్టు 18 : వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన నూతన విగ్ర హాన్ని సోమవారం తెలంగాణ రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహా నికి పూలమాల వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్దార్ పాపన్నపోరాటాలు, త్యాగాలు వెనకబడిన వర్గాల గౌర వాన్ని కాపాడటమే కాకుండా సామాజిక సమానత్వానికి మార్గదర్శకమయ్యాయని అన్నారు. ఆయన జయంతిని రాష్ర్ట స్థాయి వేడుకలుగా జరపడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిజిఐఐసి చెర్మైన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

టేక్మాల్‌లో..

టేక్మాల్, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయ సాధన సమితి టేక్మాల్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతి టేక్మాల్ లో నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అలర్పించారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ కళ్ళు గీత పారిశ్రామిక అధ్యక్షులు మనోహర్ గౌడ్, ఉపాధ్యక్షులు శివ గౌడ్, రాజు గౌడ్, తుక్కారం గౌడ్, గౌడ యువ నాయకులు సాయి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, యువజన కాంగ్రెస్ అద్యక్షులు సంగమేశ్వర్, ఆయా పార్టీల నాయకులు పాపయ్య, రాజేష్, భాస్కర్, మజర్, రవి,  సిద్దయ్య, సాగర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.