19-08-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఆగస్టు 18(విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉద్యో గ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాష్ట్రపతి ఆమోదించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాష్ట్రపతి ఆమోదించాలని, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ ‘చలో రాజ్ భవన్‘ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆప్ శ్రేణులు ప్ల-కార్డులు చేత బూని పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాజ్ భవన్ వైపు దూసుకరాగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తత దారితీయగా, బలవంతగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ.. బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని, బీజేపీ కపట నాటకంలో భాగంగానే గవర్నర్ రాష్ట్రపతికి పంపించాడని, బీసీ లకు 42 శాతం రేజర్వేషన్లుపై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు.
బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తామని డాక్టర్ దిడ్డి సుధాకర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి. మజీద్, డా. అన్సారీ, అబ్దుల్ ముక్తధీర్, జావేద్ షరీఫ్, సుధారాణి, రమ్యగౌడ్, జె. నాగరాజ్, రాకేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.