calender_icon.png 30 August, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులను ఉండనివ్వం.. అర్హులకు అన్యాయం జరగనివ్వం

30-08-2025 01:47:56 AM

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల ఆగస్టు 29 : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అనరులను ఉండనివ్వమని అర్హులకు న్యా యం చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూడబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా బీఆర్‌ఎస్ నేతలు అనర్హులకు అమ్ముకున్నారని, ఇప్పుడు అనర్హులను రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు.

అసమర్థుడనే బిరుదు లక్ష్మారెడ్డికే సరిపోతుందనిలక్ష్మారెడ్డి మా అమ్మ, అన్నను విమర్శించినా నేను పట్టించుకోలేదన్నారు. వయసులో నా కంటే పెద్దవాడని ఇప్పటికీ గౌరవిస్తున్నాన్నారు. ముడా నిధుల మళ్లింపు ముమ్మాటికీ నిజమేనని,ఎవరితోనైనా ముందుండి పోరాడుతననీ, కార్యకర్తలను అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడం నాకు రాదన్నారు.

అందరికీ మంచి చేయాలని సంకల్పంతోనే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలందరికీ సమచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వ పథకాలను అందిస్తుందని తెలియజేశారు. ఎల్లప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.