07-08-2025 12:03:42 AM
మేడ్చల్, ఆగస్టు 06 (విజయ క్రాంతి): మేడ్చల్ లోని జిల్లా పరిషత్, మండల పరిషత్ భవనాలను ఎస్సీ బాలికల హాస్టల్ కో సం అదనపు కలెక్టర్ రాధిక గుప్తా పరిశీలించారు. అంతకుముందు ఎస్సీ బాలికల హా స్టల్ ను పరిశీలించగా, అందులో కనీస సౌకర్యాలు లేవు.
దీంతో విద్యార్థినులు చాలా ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు ఉండడానికి అనుకూలంగా లేనందు న ప్రత్యామ్నాయంగా జిల్లా పరిషత్, మం డల పరిషత్ భవనాలను ఆమె పరిశీలించా రు.
ఈ రెండింటిలో ఏదైనా ఒక భవనంలోకి హాస్టల్ మార్చడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అ దనపు కలెక్టర్ వెంట జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వి నోద్ కుమార్, సహాయ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తులసి, ఎంపీడీవో తదితరులున్నారు.