calender_icon.png 27 July, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్

26-07-2025 08:46:27 PM

జనగామ,(విజయక్రాంతి): లింగాల గణపురం మండలంలోని బండ్ల గూడెం అంగన్వాడి పూర్వ ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పిల్లలను పరీక్షించారు అనంతరం రికార్డులను పరిశీలించి నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందచేయాలని ప్రతిరోజు హాజరైన పిల్లల వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. పిల్లలకు ఉండిన ఆహార పదార్థాలను అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నందున చిన్నారులకు కూడా వేడి చేసి చల్లార్చిన త్రాగునీరు ఇవ్వాలన్నారు. పిల్లలను ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలన్నారు.

అశ్రద్ధ తగదని తెలియజేశారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాలలో వస్తున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో తమ దృష్టికి తీసుకురావాలని జాప్యం చేయరాదన్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ అధికారి మత్రు నాయక్ ఈడియం గౌతమ్ రెడ్డి ఇన్చార్జ్ ఎంపీడీవో రఘురామకృష్ణ, సిడిపిఓ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.