16-08-2025 07:34:27 PM
దొంగతనాల కోసం ముఠాను ఏర్పాడిన ముగ్గురి అరెస్టు, పరారీలో ముగ్గురు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): దొంగతనాల కోసం గ్యాంగ్ ను ఏర్పాటు చేసి పదేపదే నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిపై జిల్లాలో తొలిసారిగా 313 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy) వెల్లడించారు. శనివారం మావల పోలీస్ స్టేషన్(Mavala Police Station)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చౌహాన్ రవి, సుఖ్‌దేవ్ సన్నీలు దొంగతనాల కోసం మహారాష్ట్ర నుండి కొందరు దొంగలతో కలిసి ముఠాగా ఏర్పడి తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా ప్రధాన నిందితుడైన చౌహాన్ రవి, సుఖ్‌దేవ్ సన్నీని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుండి రూ.9,500 నగదు, మూడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సాయినాథ్ ను ఇప్పటికీ అరెస్ట్ చేయగా సోహెల్, అమ్ము, కరణ్ లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ కర్రె స్వామి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ ప్రవీణ్ ల నేతృత్వంలో చేసుకుని విచారణ చేపట్టగా, ప్రధాన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.