17-05-2025 04:57:51 PM
కన్నెర చేసిన అనంతారం రైతులు..
రైతులతో అదనపు కలెక్టర్ రాంబాబుకు చుక్కెదురు..
పెన్ పహాడ్ : ఆరుకాలం కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక నానా యాతలు పడుతున్నాం. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పేరుకే ఏర్పాటు చేసినట్లు ఉంది. కేంద్రం నిర్వహకులు నుంచి మొదలు పెడితే... కాంటాలు కాక ఒకపక్క, పాత.. కొత్త గన్నీ బస్తాల పేరుతో మిల్లర్లు మెళికలు పెట్టడం. మరో పక్క ధాన్యం మ్యాచర్ వచ్చి కాంటాలు అయితే లారీలు రాక, మిల్లుల వద్ద దిగుమతి కాకపోవడం, అంతే కాదు ధాన్యం బాగాలేదని క్వింటాకు ఇంతాని కటింగ్ ఒప్పుకుంటేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు మెళికలు పెట్టడం ఈ ఘోరం ఏందని చెప్పుకుందామంటే ఏసీలకే పరిమితం అయిన ఉన్నత అధికారులు రాకపోవడం చర్యలు తీసుకోకపోవడం.. అప్పుడప్పుడు అధికారులు ఇలా వచ్చి అలా ఫొటోలు దిగి వెళ్ళిపోవడం పరిపాటుగా మారడంతో తమ ధాన్యం నెలల కొద్ది కొనుగోలు కేంద్రాలలో ఉన్నాయని మా బాధలు అర్థ కావడం లేదాని రైతులు కన్నెర చేశారు.
నెల దాటుతున్న కాంటాలు కాకపోవడంతో రైతులు పట్టణ మార్కెట్లో, దళారులకు అడ్డికిపావుసేరు అమ్ముకోవడానికి ధాన్యాన్ని తీసుకుపోతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలు నెత్తిమీదికి వచ్చాయని కాంటాలు కాకపోవడంతో కేంద్రంలో ధాన్యం రాసులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నారు. ఈ రైతుల హృదయ విదారక ఘటన శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని అనంతారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రానికి వచ్చిన అదనపు కలెక్టర్ రాంబాబుకు రైతులు అడిగిన ప్రశ్నలతో చుక్కెదెరయ్యింది. దాన్యం రాశులను పరిశీలించిన అదనపు కలెక్టర్ తాలు శాతం, మ్యాచర్ శాతం ఉంటే మిల్లర్లు నుంచి ఏలాంటి ఇబ్బందులు రావని పేర్కొనడంతో మిల్లర్లు నుంచి అధికారులు లాలూచీ పడడం.. మిలర్లకు కళ్లెం వేయక పోవడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నారని దీంతో బతుకులు బజారు పాలువుతున్నామని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదనపు కలెక్టర్ తో పాటు అక్కడికి వచ్చిన తహసీల్దారు లాలునాయక్, ఏపీఎం అజయ్ నాయక్ అధికారులకు అక్కడి రైతులు ప్రశ్నల వర్షం కురిపించడంతో మమ అనిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.