23-09-2025 12:37:34 AM
అలంపూర్, సెప్టెంబర్ 22:తుంగభద్ర నది సమీపాన ఉన్న... ఇసుక అనుమతి కోసం ఆన్లైన్లో డబ్బులు కట్టి అప్లికేషన్ చేసుకున్న... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు మాత్రం సకాలంలో ఇసుక దొరకక మధ్యలోనూ ఇండ్ల నిర్మాణం నిలిచిపోయాయని లబ్ధిదారు లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు ఇసుక కొరతను తీర్చాలని కెవిపిఎస్ నాయకులు సోమవారం రాజోలి మండల కేంద్రంలోని తాహసిల్దార్ రామ్మోహన్ ను వినతి పత్రాన్ని అందజేశారు.
సమీపంలోని తుమ్మెళ్ళ ఇసుక రీచుల వద్ద ఉన్న ఇసుకను టిప్పర్ల సహాయంతో అక్రమంగా హై దరాబాద్ కు తరలిస్తున్నట్లు ఆరోపించారు. లబ్ధిదారులకు మాత్రం ఇదుగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై సంబంధిత మై నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని తెలిపారు.
రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు విజయ్ కుమార్, ఆనంద్ బాబు,చాంద్ పాషా లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.