23-09-2025 12:37:37 AM
గరిడేపల్లి, సెప్టెంబర్ 22 : మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన కేశబోయిన శ్రవణ్ సునీత దంపతుల కుమార్తె శరణ్య ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 530 మార్కులతో ఆల్ ఇండియా 24012 వ ర్యాంకను సాధించి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రభుత్వ సీటు సంపాదించింది.
వెలిదండ గ్రామ15 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఒక యువతి ఎంబీబీఎస్ సీటు సాధించడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధుమిత్రులు శ్రవణ్ సునీత దంపతులకు, శరణ్యకు అభినందనలు తెలిపారు.