07-11-2025 12:18:04 AM
నేడు ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టపన
నిర్మల్, నవంబర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉత్తర తెలంగాణ లోని భక్తుల ఇలవేల్పు దైవంగా కొలిచే మొహా అడెల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన గురువా రం నిర్వహించనున్నారు. ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన అడెల్లి పోచమ్మ ఆలయం సారంగాపూర్ మండలంలోని అడెల్లి గ్రామ సమీపంలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటయింది. ఈ ఆలయానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయి తీగా ఉంటుంది.
అడెల్లి ఆలయం గుడి చిన్నదిగా ఉండడం భక్తులకు ఇబ్బందిగా ఉండ డంతో దేవాదాయ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 6.60 కోట్లతో కొత్త నమూనా కృష్ణ ఏకశిలాలతో కొత్త మందిరాన్ని మంజూరు చేశా రు. 2023లో పనులు ప్రారంభించగా ఇటీవలే కృష్ణ శిలలతో వైభవంగా విశాలంగా నిర్మించారు. తమిళనాడుకు చెందిన కళాకారులతో పోచమ్మ విగ్రహంతో పాటు సప్త చెల్లెలు పోతరాజులు ధ్వజస్తంభం చుట్టు ప్రహరీ గోడ అధునాతన సదుపాయాలతో ఈ ఆలయం నిర్మించారు. భక్తుల ఇలవేల్పుగా కొలిచే అడెల్లి పోచమ్మ ఆలయంలో నూతన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం జరగనుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హాజరవుతున్నారు.
ఈనెల మూడు నుంచి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం నిర్వహించనున్న విగ్రహా ప్రతిష్టాపనకు వివిధ పీఠాపతులను ప్రముఖులు హాజరుకాను నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏర్పాట్లను మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు ఆలయ కమిటీ చైర్మన్ బోజ గౌడ్ ఆల ఈవో భూమన్న ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు అన్నప్రసాదాన్ని నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో అందించనున్నారు