calender_icon.png 7 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే ఇలాకాలో ఇసుక దందా?

07-11-2025 12:16:38 AM

  1. అసలే ఎమ్మెల్యే మండలం అధికారులు ఆ వైపే చూడరంట

ట్రాక్టర్ రేసింగ్ పోటీలలా మట్టి తవ్వకాలు ఇసుక తయారీ

అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

ఇదేం దౌర్జన్యం అంటున్న ప్రజానీకం

రాజాపూర్ నవంబర్ 6 : సంచలనాత్మక ప్రకటనలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నూతన ఒరవడిని సృష్టిస్తూ మాది జడ్చర్ల నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అంటూ ప్రత్యేకంగా చెప్పే అవసరం లేకుండా ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత మండలంలోని అక్రమ ఇసుక దందా దర్జాగా జరుగుతుందని తెలుస్తుంది. ఇందుకు ప్రత్యేక సాక్షాధారాలు లేకపోలేవు.

అధికారుల సైతం అక్రమ ఇసుక దందా తరలింపు జరుగుతుంది ఫిల్టర్లను ధ్వంసం చేస్తున్నారని సాక్షాత్తు తాసిల్దార్ చెబుతున్నారు అంటే అక్రమ ఇసుక దందా ఎంత యాదయ్య జరుగుతుందో ఒక్కసారి అటువైపు చూడవలసిన అవసరం ఉంది. రాజపూర్ మండలంలో దుందుభి వాగు పరిపాక గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యంత్రాల పోటీని తలపించేలా సాగుతుంది.

ఎవరేమన్నా అంటే మాది అధికార పార్టీ మమ్మల్ని ఆపుతారా అంటూ ఎదురు ప్రశ్నలు, అవసరమైతే ఎదురు దాడి కూడా జరుగుతుందని భయంతో ప్రజలు ఎవ్వరు కూడా అటువైపు చూడడమే మానేశామని ఆ ప్రాంత ప్రజలే చెబుతున్న మాట. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బందుల గురి చేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తూ ఆ మట్టి ద్వారా ఇసుకను తయారుచేసి దర్జాగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆ ప్రాంతవాసులు లోలోపలనే మదన పడుతుందని నిర్వటంగానే చెబుతుండ్రు.

ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి అక్రమంగా ఇసుక తరలింపు మట్టి తరలింపు పనులకు ముగింపు పలికితే ప్రజల నుంచి మరింత మండల పొందే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్న మాట. 

మట్టిని తవ్వేస్తుండ్రు కృత్రిమ ఇసుక తయారీ..

తిరుమలాపూర్ గ్రామం షా సిటీ నుండి మొదలుకొని చెన్నవెల్లి,కుచర్కల్, రాయపల్లి,ముదిరెడ్డిపల్లి,రాజాపూర్, మల్లేపల్లి గ్రామ శివారులో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుంది. పదులకొద్దీ జెసిబి లు హిటాచీలు, వందలకొద్దీ ట్రాక్టర్లతో వాగును తోడేస్తున్నారు. యంత్రాలతో మట్టినితోవి కృత్రిమంగా ఇసుకని తయారుచేసి టిప్పర్ల ద్వారా పట్టణానికి తరలిస్తున్నారు.

ప్రతినిత్యం మండలం నుండి పదుల సంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తు సొమ్ము ఆదాయమే వారి ప్రథమ కర్తవ్యం అడుగులు వేస్తుంటారని ప్రజలు చెబుతున్న మాట.  ఇంత యాదేచ్చగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న అటువైపు చూడని పోలీస్, మైనింగ్,రెవిన్యూ అధికారులు చూడడం లేదని తెలుస్తుంది.  ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత మండలం లో ఇసుక అక్రమ రవాణా ఇంత బహిరంగంగా జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రహదారులు సైతం గుంతలమయం 

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాల్లో సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వం కోట్ల నిధులతో నిర్మిస్తున్న రహదారులు కూడా ఇసుక అక్రమ రవాణా వల్ల గుత్తలమయంగా మారుతున్నాయి.  అధిక లోడుతో వెళుతున్న టిప్పర్ల వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయదారులు తమ పొలాలకు వెళ్ళు మట్టి రోడ్లు గుంతలు పడి వాడకలు ఏర్పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని  ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ప్రజలు కోరుతున్న వారి కోరికను అధికారులు తీరుస్తారా లేదా అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. 

ఇసుక పిల్టర్లు ధ్వంసం చేస్తున్నాం  

మండలంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు తగిలిన చర్యలు తీసుకుంటు న్నాం. గురువారం రాజాపూర్ మండల కేంద్రంతోపాటు ఇతర గ్రామాల్లో మూడు ఇసుక ఫిల్టర్‌లను ధ్వంసం చేశాం. దుందుంబి వాగు పరివాహక గ్రామాల్లో పూర్తిగా జల్లెడ పట్టి ఇసుక అక్రమ రవాణా పూర్తి అరికడతం. అక్రమంగా ఇసుక తరలిస్తుండ్రు అనే విషయాలు మా దృష్టికి వచ్చాయి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు సమాచారం తెలిసిన వెంటనే సమాచారం అందించాలి. 

రాధకృష్ణ, తహసీల్దార్, రాజాపూర్, మహబూబ్ నగర్ జిల్లా