04-10-2025 12:49:55 AM
భద్రాద్రికొత్తగూడెం, అక్టోబర్ 3, (విజయక్రాంతి):పండగలు ఐకమత్యానికి వేదికగా నిలవాలని,అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ ఐకమత్యంతో జరుపుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నా రు.శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని పలు ఏరియాలలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ పండుగలు, ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకొని మానవ సంబంధాలను మెరుగుపర్చాలని అన్నారు. ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. ప్రజాస్వామ్య భారతదేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలు జరుపుకోవడం మంచి పరిణామమని అ న్నారు.
ప్రజలు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల రాగద్వేషాలకు దూరంగా ఉంటారని, తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జములయ్య, వాసిరెడ్డి మురళి, ఎస్.కె.ఫహీమ్, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, మునిగడప వెంకన్న, రమణమూర్తి,ఖయ్యూం, కమల్, మధు, తూముల శీను, మండలరాజు, పాటి మోహన్, మాజీ కౌన్సిలర్లు యూసుఫ్, ధర్మరాజు, మునిగడప పద్మ, భూక్య శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, బి.సత్యనారాయణ చారి, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.