24-09-2025 05:41:38 PM
ముకరంపురా,(విజయక్రాంతి): కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న 6 నెలలు వయస్సున్న ఇద్దరు మగ శిశువులను విశాఖపట్నం, మేడ్చల్ మల్కాజ్గిరి చెందిన ఇద్దరు పిల్లలు లేని దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ దత్తత కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. అనాథ శిశువుల దత్తత, రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలనుకునే వారు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.