24-09-2025 05:37:14 PM
నకిరేకల్,(విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో ఆసిఫ్ నహర్ బ్రిడ్జిపై ఇరువైల రోడ్డు నిర్మాణం చేసి ప్రజల సమస్య పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద నిరసన తెలిపి ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం నూతన బ్రిడ్జి నిర్మాణం చేసి ఇరువైపులా సీసీ నిర్మాణం చేయకపోవడంతో పోసిన మట్టి పూర్తిగా కొట్టుకుపోయి రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని అన్నారు.
నూతన బ్రిడ్జి నిర్మాణం చేసినా మళ్లీ పాత బ్రిడ్జి నుండే పోవాల్సి వస్తుందని ప్రమాదకరంగా మూలమలుపు ఉండడంతో ప్రయాణాలు ఇబ్బందిగా మారి ప్రమాదాలు జరుగుతున్నయని అన్నారు. అధికార యంత్రాంగానికి ప్రజలు విన్నవించినా నిరసన కార్యక్రమాలు చేసినా పట్టించుకోవడంలేదని వెంటనే ప్రజల సమస్య దృష్టిలో పెట్టుకొని ఇరువైపులా సిసి రోడ్డుకు నిధులు విడుదల చేసి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.