calender_icon.png 26 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్యంపై కల్తీ పాపాలు!

26-09-2025 12:00:00 AM

  1. పాలను విషతుల్యం చేస్తున్న అక్రమార్కులు

కాసుల కోసం ప్రాణాలతో చెలగాటం

ఇటు వ్యాపారం, అటు ప్రజలకు విక్రయం

జిల్లాలో పెట్రేగిపోతున్న కల్తీ మాఫియా

పుట్టగొడుగుల వెలుస్తున్న పాల విక్రయ కేంద్రాలు

రోగాల భారీన పడుతున్న ప్రజలు

పట్టించుకోని సంబంధిత అధికారులు

మణుగూరు, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఆరోగ్యకర జీవనానికి పాలు, పాల పదార్థాలు ఎంతో కీలకం. అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కొందరు అక్ర మార్కులు కల్తీ దందాకు తెరలేపుతున్నారు. నల్లని వన్నీ నీళ్లు, తెల్లని వన్నీ పాలు అనే చందనా పాపాల భైరవులు ప్రజారోగ్యాలపై విషం చిమ్ముతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలవ్యాపారం పాపపు పుంతలు తొక్కుతుంది.

పిల్లల నుండి పెద్దల వరకు కృ త్రిమ, రసాయనాలు కలిపే పాలు సేవిస్తూ ఆనారోగ్యాల భారిన పడుతున్నారు. కానీ ఇవేమీ మాకు పట్టవు అన్నట్లుగా అక్రమార్జన కోసం కొందరు వ్యాపారులు అమృతం లాంటి పాలను కాలకూట విషంగా మారు స్తూ కాసులు దండుకుంటున్నారు. వీరి పా’ పాల’పై విజయక్రాంతి అందిస్తున్న కథనం..

పాలను విషతుల్యం చేస్తున్న అక్రమార్కులు..కళ్ళ ముందే నకిలీ పాలను తయారు చేసే మాయల మరాఠీలు తయారయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కల్తీ కిల్లర్స్ పంజా విసురుతున్నారు. నిత్యం వాడే పాలను కల్తీ చేస్తూ రాక్షసానందం పొందు తున్నారు. ఆరోగ్యాలతో ముప్పని తెలిసినా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.

గంజిపౌడర్, యూరియా, డిటర్జెంట్ లాంటి మిశ్రమాలను కలుపుతూ లీటరు పాలను 10 లీటర్లు గా మారుస్తూ లాభార్జనే ధ్యేయంగా లక్షలు సంపా దిస్తున్నారు. స్వచ్ఛమైన గేదె పాలు అని నమ్మి కొనుగోలు చేస్తూ విని యోదారులు మోస పోతున్నారు. ఈ కల్తీ జరిగే దంతా గ్రామీణ ప్రాంతాల్లోనేనని తెలుస్తుంది.

కల్తీకి అడ్డాగా మారిన గ్రామీణ ప్రాంతాలు...

జిల్లా వ్యాప్తంగా పట్టణాలకు సరఫరా అయ్యే పాలు కొత్తగూడెం పాలకేం కేంద్రా నికి పెనుబల్లి, రాఘవాపురం, వేపలగడ్డ, సు జాతనగర్ నుండి సరఫరా అవుతాయి. భద్రాచలం పట్టణానికి సారపాక, రెడ్డిపాలెం, లక్ష్మీపురం నుండి, ఆశ్వా రావుపేట పట్టణానికి అచ్చుతాపురం, నారాయణపురం, తిరు మలకుంట అదే విధంగా ఇల్లందుకు సత్యనారాయణపురం, మణుగూరు పట్టణనికి ఏడూళ్ళ బయ్యారం, రామానుజవరం, చి క్కుడు గుంట, కమలాపురం గ్రామీణ ప్రాం తాల నుండి సరఫరా అవుతాయి.

ఈ ప్రాంతాల్లోనే కొందరు కేటుగాళ్లు పాలను ముందు గానే కల్తీ చేసి పట్టణాలకు తరలిస్తున్న దృశ్యా లు విజయ క్రాంతి నిఘాలో బయటపడింది. ఇదిలా ఉండగా పట్టణా లకు చేరిన పాలను కేంద్రాలవ్యాపారులు వారి చాకచక్యంతో పాలపౌడర్, ఇతర కెమికల్స్ కలుపుతూ మరింత కల్తీ చే స్తున్నారని తెలుస్తుంది. పాలమాయ రోజు రో జుకు కొత్త పుంతలు తొక్కుతుంటే సం బంధిత అధికారులు తమకేమిపట్టనట్టుగా వ్యవహరించడం పట్ల ప్రజాఆరోగ్యాలపై వారికున్న విశ్వసనీయత ఎంతో తేటతెల్లమౌతుంది.

గల్లీకో దుకాణం గేదె పాల పేరుతో విక్రయం...

గతంలో ప్యాకెట్, పాలు పెరుగును అ మ్మే వ్యాపారులను చూసాం. కాని నేడు మ ణుగూరు, పాల్వంచ పట్టణంలో గల్లీకో లూ జ్ పాలు, పెరుగు దుకాణాలు దర్శనమి స్తు న్నాయి. కల్తీ మాయను తెలుసుకున్న కొంద రు ప్రబుద్ధులు వ్యాపారం లాభసాటిగా ఉం డడంతో ఇదే పనిలో కొందరు పడ్డారు. విజయవాడ నుండి తెచ్చే గంజీ పౌడర్, పాల పౌడర్, కెమికల్స్ ను వేడి నీటిలో కలిపి అం దులో 10 లీటర్ల పెరుగుకు ఒక లీటరు స్వచ్చమైన పాలు పోసి కృత్రిమ పెరుగును, పాల ను తయారు చేస్తూ లీటర్ రూ. 60 నుండి రూ 70 చొప్పున విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కొందరు గల్లీకి ఒక దుకాణం ఏర్పాటు చేసి గేదె పాల పేరుతో విక్రయాలు చేస్తు న్నారు. వారికి కొందరు పాల వ్యాపారులు పాలను లీటర్లలో ఆటోలు ద్వారా సరఫరా చేస్తున్నా రు. మరోవైపు జిల్లాలో కొత్తగూడెం, పాల్వం చ,మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లందు, భద్రాచలం పట్టణాలలో కల్తీ పాల వ్యాపా రం జోరుగా సాగుతుందని ఆరోపణలు వెల్లడౌతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల నుండి పా ల వ్యాపారులు పట్టణాలకు ఎగుమతి చే స్తున్న పాలన్ని పట్టణాలు చేరి విషతుల్యం అ వుతున్నాయి. పాల కేంద్రాల వ్యాపారులువి ష రసాయనాలను, పాలు చిక్కబడేందుకు యూరియా లాంటి మిశ్రమాలను కలుపు తూ ప్రజల ప్రాణాలతో చెలగామాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పశువులు పాలు ఎక్కువగా ఇవ్వడానికి గతంలో యూరియాను పశుదాణాలో కలిపేవారు.

ప్రస్తుతం పద్దతి మార్చి పాలల్లోనే యూరియాను కలుపుతూ లక్షలు వెనకేసుకుంటున్నారు కొంద రు ప్రభుద్దులు. దీంతో వయస్సు పై బడిన వారు, రోగ నిరోదక శక్తి తక్కువగా ఉండే వారు ఈ పాలను సేవిస్తే అనారోగ్యపాలౌతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పట్టించు కోని సంబంధిత అధికారులుసంవత్సరాలుగా ఈ కల్తీ పాల విక్రయాలు చేస్తున్న ప్పటికీ సంబంధిత అధికారులు పట్టించు కోకపోవడం పలు అను మానాలకు తావిస్తుంది. జిల్లాలో ప్రతి నియోజ కవర్గంలో పట్టణాలకు పాలు సరఫరా చేసేవ్యాపారులు గ్రామీణ ప్రాంతాలనే కేంద్రం గా చేసుకుని కల్తీ పాలను తయారు చేస్తున్నారని సమాచారం.

ఈ వ్యాపారా లపై అధికారులు దృ ష్టి సారించకపోవడం తో కల్తీ దందా మూడు పువ్వులు, ఆరుకాయలుగా వీరాజిల్లుతోంది. ఇందు లో నిజమెంత.. అబద్ధమెంత.. తెలు సు కోవాలంటే జిల్లా ఫుడ్ ఇన్స్పెక్ట ర్లు తమ విధిలో భాగంగా దుకాణాలపై పర్యవేక్షణ చేసి కల్తీ వ్యాపారం చేస్తున్న కేటుగాళ్ళ ను కట్టడి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.