calender_icon.png 22 January, 2026 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మెడికవర్’లో అధునాతన సర్జరీ మెషిన్

22-01-2026 01:45:27 AM

సికింద్రాబాద్‌లో రోబోటిక్ -అసిస్టెడ్ ఆర్థోపెడిక్ 

యంత్రాన్ని ప్రారంభించిన సీపీ సజ్జనార్

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్, ఆర్థోపెడిక్ చికిత్స రంగంలో మరో కీలక అడుగు వే సింది. ఆధునిక రోబోటిక్-అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ సౌకర్యాన్ని సీపీ సజ్జనార్, డాక్టర్ అనిల్ కృష్ణ  మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, డా. ఉదయ్ కృష్ణ మైనేని, సీనియర్ కన్సల్టెంట్, హెచ్‌ఓడీ, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సతీష్ మరియు చీఫ్ బిజి నెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. “ఆధునిక రోబోటిక్ టెక్నాలజీని వైద్య సేవల్లో సమీకరించడం అనేది నేటి ఆరోగ్యరంగం తీసుకుంటున్న దిశకు నిదర్శనం అన్నారు.