22-01-2026 01:46:44 AM
జైలు పర్యవేక్షణ అధికారిగా దండు భరత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ
చర్లపల్లి: జనవరి 21 (విజయ క్రాంతి): చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్గా ప్రమోద్ పదవీ బాధ్యతలు స్వీకరిం చారు. ఇటీవల వరకు నల్గొండ జిల్లా జైలు అధికారిగా విధులు నిర్వహించిన ప్రమోద్, డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసి పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్గా అధికారికంగా ఛార్జీ తీసుకున్నారు.
అదే విధంగా, చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం సూపరింటెండెంట్గా దండ భరత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉప పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహించిన ఆయన, తాజాగా పర్యవేక్షణ అధికారిగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో దండు భరత్ రెడ్డి చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు పరిరక్షణ అధికారిగా అధికారికంగా ఛార్జీ తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఈ సందర్భంగా ప్రమోద్, భరత్ రెడ్డి లకు జైలు సిబ్బంది ఘనస్వాగతం పలికారు.