22-08-2025 11:21:04 PM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2025 నూతన పనుల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రావడం జరిగింది. శుక్రవారం తూప్రాన్ పరిధిలోని వెంకటరత్నాపూర్ గ్రామంలో నానో యూరియా వాడకం వలన అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నానో యూరియా గొప్పతనాన్ని వివరిస్తూ కలెక్టర్ స్వయంగా వరి పొలానికి నానో యూరియా పిచికారి చేస్తూ రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నానో తో పర్యవరణ పరిరక్షణతో పాటు పోషక విలువల సామర్ధ్యం ఎక్కువ ఉంటుందని నేలకు, పంట కు మేలు జరుగు తుందన్నారు, దీనితో ప్రతి రైతుల్లో చైతన్యం రావాలని వివరించారు. పంటలకు రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని, పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా అంతేనని అధికారులు రైతులకు తెలుపాలన్నారు.