calender_icon.png 23 August, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలి

23-08-2025 12:00:00 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): ఈ నెల 24 న చొప్పదండి నియోజకవర్గం లో జరిగే జనహిత పాద యాత్ర, 25 న శ్రమదానం కార్యక్రమాల ను వి జయవంతం చేయాలని న గర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి న రేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ముకరంపుర లోని నగర కాంగ్రెస్ కార్యాలయంలో సమాయత్త సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మ హేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా మంత్రులు, శాసన సభ్యులు, ముఖ్యనాయకులు పాల్గొనే ఈ పాదయాత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.

ప్రతి ఒక ఉ మ్మడి జిల్లాలోని ఒక నియోజక వర్గంలో మొదటి దఫా పాదయాత్ర జరుగుతుందని, ఈ పాదయాత్రలో నగరంలోని 66 డివిజన్ల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వి జయవంతం చేయాలని కోరారు. ఈ నెల 24 న గంగాధర మండలం ఉప్పరిమల్యాల నుండి ప్రారంభమై కురిక్యాల చౌరస్తా మీదుగా గంగాధర వరకు పాదయాత్ర కొనసాగుతుందని,

25 న ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం ఉంటుందని ఈ రెండు రోజులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఇది మంచి అవకాశంగా భావించాలని ప్రతి ఒక్కరూ విధిగా పాల్గొనాలని న రేందర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్, సీనియ ర్ నాయకులు సమద్ నవాబ్, చర్ల పద్మ, దన్న సింగ్, డివిజన్లఅధ్యక్షులు తదితరులుపాల్గొన్నారు.