calender_icon.png 23 August, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ తో పోరాడుతూ యువకుడు మృతి

22-08-2025 11:17:14 PM

ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్న శివరాజు రెడ్డి..

లంబాడిపల్లిలో విషాదం..

చిగురుమామిడి,(విజయక్రాంతి): చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన కాటం శివరాజు రెడ్డి(29) అనే యువకుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచాడు.  శివరాజు రెడ్డి కరీంనగర్ లోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా దాదాపు 5సంవత్సరాలుగా పనిచేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. చాలా ఆరోగ్యంగా ఉన్న రాజు రెడ్డి నెల రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా క్యాన్సర్ గడ్డలు ఉన్నట్లు వైద్యులు తెలిపారని  పేర్కొన్నారు.

ఆపరేషన్ చేసి మూడు కిలోల కణతిని తొలగించినా ప్రయోజనం లేదని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు. క్యాన్సర్ తో నెలరోజులపాటు నాన ఇబ్బందులు పడుతూ మృతి చెందినట్లు వివరించారు. మృతుడు శివరాజు రెడ్డికి వివాహం కాలేదని,మృతుడికి తల్లిదండ్రులు సంజీవ్ రెడ్డి,సోదరుడు తిరుపతి రెడ్డి లు ఉన్నారు. శివరాజు రెడ్డి మృతితో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.