26-09-2025 01:17:34 AM
-న్యాయవాదుల డిమాండ్
-ఇందిరా పార్కు వద్ద ధర్నా
-మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేత వీహెచ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.15 వేల స్టుఫైండ్ ఇవ్వాల ని కోరుతూ గురువారం ఇందిరాపార్క్ వద్ద జూనియర్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా న్యా యవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 41 సిఆర్‌పిసిని అమెండ్ చేయాలని కోరారు. దీని వల్ల న్యాయవాదులకే కాకుండా కక్షిదారులకు కూడా న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు.
ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు, వంశీకృష్ణ జక్కుల మద్దతు తెలిపా రు. ధర్నాలో పొన్నం దేవరాజ్ గౌడ్ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారెడ్డి జిల్లా కోర్టు జనరల్ సెక్రెటరీ, అల్లా మోహన్ మల్కాజ్గిరి బార్ వైస్ ప్రెసిడెంట్, జగదీష్, సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.