calender_icon.png 26 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన పోలీస్ దేశానికే ఆదర్శం

26-09-2025 01:17:23 AM

  1. శాంతి భద్రతల పరిరక్షణలో ఖచ్చితంగా వ్యవహరించాలి

గంజాయి నిర్మూలనకు కాలేజీల్లో అవగాహన కల్పించాలి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేటలో పోలీస్ క్యాంటీన్ ప్రారంభం  

సూర్యాపేట, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి) : తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శం అని, వారి గౌరవాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీసు (కాప్స్) ఫిట్ నెస్ సెంటర్, సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్ ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో 24 గంటలు పని చేసే పోలీస్ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం బాధ్యత అన్నారు.ఇందులో భాగంగానే ప్రతినెల పోలీసులకు సరుకుల కొనుగోలులో ఆదా చేసేందుకుగాను సబ్సిడీ క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రతి పోలీసు తప్పనిసరిగా ఫిట్ నెస్ ని రక్షించుకోవాలన్నారు. పోలీస్ క్యాంటీన్ వల్ల జిల్లాలో సుమారు 1500 మంది పోలీస్ సిబ్బందికి మేలు కలుగుతుందన్నారు.

జిల్లాలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా భరోసాను మరింత ముందుకు తీసుకెళ్లాలని శాంతిభద్రతల పరిరక్షణలో ఖచ్చితంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మహిళల పట్ల అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి నిర్మూలనకు కళాశాలలో అవగాహన కార్యక్రమాలను కల్పించాలని,

నకిలీ విత్తనాల పట్ల చౌకధర దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యం అక్రమ రవాణా కాకుండా చెక్ పోస్ట్ లను పటిష్టం చేయడమే కాకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నిర్మాణానికి గాను ప్రభుత్వం ద్వారా రూ.30 లక్షల నిధులను మంజూరు మంత్రి హామీ ఇచ్చారు.

తదుపరి సమీకృత కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో నిర్మించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ జిల్లా ఉన్నతాధికారుల నివాస గృహాలను ఆయన ప్రారంభించారు. ఈయన వెంట ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, మందుల సామేలు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు  చెవిటి వెంకన్న యాదవ్, అదనపు ఎస్పి, డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు ఉన్నారు.