calender_icon.png 13 July, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లకు కొలతలు చేసిన ఏఈ

12-07-2025 06:31:36 PM

దండేపల్లి (విజయక్రాంతి): మండలంలోని తాళ్లపేటలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణ పనులను శనివారం హౌసింగ్ ఏఈ ఇలియాస్ పరిశీలించారు. బేస్ మెంట్ లెవెల్ లో పూర్తి చేసిన లబ్దిదారుడు దుర్గం రజిత రవీందర్ ఇంటి నిర్మాణాన్ని మెజర్మెంట్(కొలతలు) చేసి, మొదటి విడత బేస్‌మెంట్ లెవల్ బిల్ లక్ష రూపాయలు మంజూరు కోసం రికార్డు చేశారు. హౌసింగ్ ఏఈ వెంట పంచాయతీ కార్యదర్శి సతన్న, కారోబార్ శ్రీనివాస్, తాళ్లపేట మాజీ ఎంపీటీసీ కంది సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ అడాయి కాంతారావు తదితరులు ఉన్నారు.