calender_icon.png 13 July, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీపీ, షుగర్ కి మందులు లేవు

12-07-2025 06:29:29 PM

శనివారం డాక్టరుకు సెలవు..

సిద్దిపేట (విజయక్రాంతి): పుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre)లో శనివారం డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పలేదు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెలవు కారణాలు చూపించి డాక్టర్ రాకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఆస్పత్రికి వెళ్లిన రోగులకు బీపీ, షుగర్ మందులు లేవంటూ వాపస్ పంపించగా రెండవ శనివారం పబ్లిక్ హాలిడే అంటూ డాక్టర్ విధులకు గైర్హాజరయ్యారు. ఈ విషయంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ బాబ్జిని వివరణ కోరగా రెండవ శనివారం డాక్టర్లకు సెలవు ఉంటుందని వివరించారు. ఆస్పత్రిలో మందులు లేవనేదీ అవాస్తవమన్నారు. విధులలో సిస్టర్ ఉందని ఆసుపత్రికి వచ్చిన రోగులు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మాట దాటవేశారు.